Jul 19,2023 16:05

ప్రజాశక్తి-తుగ్గలి : మండలం పరిధిలోని చెన్నంపల్లి గ్రామానికి చెందిన సింగిల్ విండో మాజీ అధ్యక్షులు ఓరుగంటి వెంకటేశ్వరరెడ్డి (58) అనారోగ్యంతో మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సింగిల్ విండో అధ్యక్షులుగా పని చేసిన ఆయన సొసైటీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. ప్రస్తుతం ఆయన కిడ్నీ వ్యాధితో బాధపడుతూ కోలుకోలేక మృతి చెందినట్లు వారు తెలిపారు. ఆయన మృతి పట్ల పత్తికొండ శాసనసభ్యులు శ్రీదేవి, కేడిసిసివైస్ మాజీ చైర్మన్ రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ, మాజీ ఎమ్మెల్యే తనయుడు శ్రీనివాసరెడ్డి,సొసైటీ అధ్యక్షులు విజయలక్ష్మి, మాజీ జెడ్పిటిసి జగన్నాథ్ రెడ్డి, వైసిపి యూత్ వింగ్  జిల్లా కార్యదర్శి తుగ్గలి మోహన్ రెడ్డి, చంద్ర శేఖర రెడ్డి,జడ్పీ మాజీ చైర్మన్ బత్తిన వెంకటరాముడు, టీడీపీ నాయకులు వెంకటపతి, వైసిపి నాయకులు సుంకన్న, తదితరులు తమ ప్రగాఢ సానుభూతి  వ్యక్తం చేశారు.