Sep 24,2023 16:43

ప్రజాశక్తి-మక్కువ : మండలంలోని దెబ్బ గడ్డ పంచాయతీ పరిధిలో విజయరామపురం సమీపంలోని ఆదివారం మధ్యాహ్నం పిడుగుపాటుకు 9 మేకలు, రెండు గొర్రెలు మృతి చెందాయి. మండలంలోని కోన గ్రామానికి చెందిన యాసై గంగయ్య వెంకటరమణ తదితరులు గొర్రెలు కాపర్లు మేత కోసం గొర్రెలను తీసుకువెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం ఉరుములతో కూడిన వర్షం పడింది. ఇదే సందర్భంలో చలిపిడుగు కూడా పడడంతో ఒక్కసారిగా మేకల మంద వనికిపోతూ ఒకదాని తర్వాత మరొకటి ఇలా వరుసగా 11 మేకలు, గొర్రెలు మృతి చెందాయి. దూరం నుంచి గమనించిన మేకలు కాపర్లు దగ్గరకు చూసేసరికి మొత్తం చనిపోయాయి. దీంతో స్థానిక వెటర్నరీ ఎం రమేష్ కు సమాచారం అందించారు. ఘటన స్థలము కు  చేరుకున్న బటర్ని ఉద్యోగి ఉన్నతాధికారులు సమాచారం అందించారు. మేకలకు ఎటువంటి భీమా లేదని ధ్రువీకరించారు. దీంతో రెవెన్యూ అధికారులు కూడా సమాచారం ఇచ్చారు. ప్రకృతి తమను కోలుకోలేని దెబ్బతీసిందని గొర్రెల కాపరులు వినిపిస్తున్నారు తమను ప్రభుత్వం  ఆదుకోవాలని  కోరుతున్నారు.