Sep 16,2023 15:58

ప్రజాశక్తి-ఆదోని రూరల్ : పట్టణంలోని ప్రైవేట్,కార్పొరేట్ స్కూళ్ళలో జరుగుతున్న ఫీజుల దోపిడీని అరికట్టాలని రాయలసీమ పరిరక్షణ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నవీన్ కుమార్, జిల్లా కార్యదర్శి బాలు కోరారు .శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతులు లేకుండా పుస్తకాలను అమ్ముతున్నారని, నర్సరీ నుండి పదో తరగతి వరకు 20 వేల నుండి 90 వేల వరకు వసూలు చేస్తున్నారని తెలిపారు. ప్రైవేట్,కార్పొరేట్ స్కూళ్ళయిన పట్టణంలోని అక్షర శ్రీ, నేషనల్ స్కూల్,నారాయణ, చైతన్య ,శారదనికేథన్,భాష్యం,అమరావతి స్కూళ్లల్లో జరుగుతున్న అధిక ఫీజుల దోపిడీపై ఈ స్కూళ్లను సందర్శించి విచారణ చేపట్టి చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.అలాగే కనీస వసతులు లేకుండా విద్యార్థులను క్రీడలకు దూరం చేసి మానసిక ఒత్తిడికి గురిచేస్తూ అక్షరాలతో లక్షల వ్యాపారం చేస్తున్న  స్కూళ్లలో ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించని స్కూళ్లను సీజ్ చేయాలని అన్నారు. ఎన్నిసార్లు ఎంఈఓ వద్ద మొరపెట్టుకున్న చలనం లేదని, నిర్లక్ష్యం వహిస్తున్న ఎంఈఓ లను సస్పెండ్ చేయాలని కోరారు. అనంతరం స్థానిక మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పవన్, హనుమంతు, వీరేశ్, హరి, విష్ణు, నరసింహ పాల్గొన్నారు.