Oct 28,2023 13:16

ప్రజాశక్తి-విజయవాడ : ఏపీ ఈఎపిసెట్ మూడవ విడత కౌన్సెలింగ్ నిర్వహించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.ప్రసన్న కుమార్, ఎ. అశోక్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ చేరేందుకు రాష్ట్రంలో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా నిర్వహించే ఈఎపిసెట్ ఇప్పటికీ రెండు విడతల కౌన్సెలింగ్ నిర్వహించారన్నారు. ప్రభుత్వ యూనివర్సిటి, ప్రయివేటు యూనివర్సిటి, ప్రయివేటు కళాశాలల్లో కలిపి1,21,306 సీట్లు ఉండగా పరీక్షలో 1,57,319 మంది అర్హత సాధించగా, 94,580 సీట్లు (78%) భర్తీ అయ్యాయని తెలిపారు. ఇంకా 26,726 సీట్లు ఖాళీలు ఉన్నా చేరేందుకు అర్హులైన వారు ఉన్న మూడవ విడత కౌన్సెలింగ్ ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. గత విద్యా సంవత్సరం 20వేల సీట్లు ఖాళీగా ఉంటెనే ప్రత్యేక కౌన్సిలింగ్ ఎర్పాటు చేశారని గుర్తుచేశారు. పక్క రాష్ట్రం తెలంగాణ నిర్వహించే ఎంట్రన్స్ పరీక్షలో నాలుగు విడతలు నిర్వహించిన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్ధులను తగ్గించుకుని ఫీజు రీయింబర్స్మెంట్  ను తగ్గించుకోవడంలో భాగమే అన్నారు. అందుకే మూడవ విడత కౌన్సెలింగ్ నిర్వహించకుండా స్పాట్ అడ్మిషన్లు నిర్వహించారన్నారు. వెంటనే మూడవ విడత కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.