nagadu estunna syamkishorenaidu
శ్యామ్ కిషోర్ ఆర్థిక సాయం
ప్రజాశక్తి-అవనిగడ్డ
విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు కిందపడి గాయాలకు గురైన పారిశుద్ధ్య కార్మికురాలు బొంతుల బాపనమ్మకు శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ నిర్వాహకులు తోట శ్యామ్ కిషోర్ నాయుడు రూ.5000 ఆర్థిక సహాయం అందజేశారు. బాపనమ్మ చేతికి తీవ్ర గాయం కావడంతో సంఘటన విషయం తెలుసుకున్న శ్యామ్ కిషోర్ నాయుడు ఆమె స్వగృహానికి వెళ్లి పరామర్శించి నగదు సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వర్రె బస్వారావు, సైకం శ్రీనివాసరావు, యర్రంశెట్టి నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.










