Sep 16,2023 13:23

ప్రజాశక్తి-పాడేరు : విశాఖ ఉక్కు రక్షణకై ఉత్తరాంధ్ర బైక్ యాత్రను జయప్రదం చేయాలనీ సిపిఎం జిల్లా కార్యదర్శి  పి.అప్పలనరస పిలుపునిచ్చారు. పాడేరులో శనివారం బైక్ యాత్ర గోడపత్రులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అప్పలనరస మాట్లాడుతూ  విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రప్రభుత్వం 100% వ్యూహాత్మక అమ్మకానికి వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో ఈయాత్ర జరుగుతోందని అన్నారు. ప్రజల సంపదతో నిర్మించిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షించుకుందామని పిలుపునిచ్చారు.