May 24,2023 16:21

ప్రజాశక్తి-చల్లపల్లి : మండల పరిధిలోని మంగళాపురం గ్రామంలో ఉపాధి హామీ పథకం పని ప్రదేశాన్ని బుధవారం ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు యద్దనపూడి మదు సిఐటియు మండల కార్యదర్శి మహమ్మద్ కరీముల్లాతో కలిసి పరిశీలించారు. కూలీలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేరళ రాష్ట్రము మాదిరిగా రోజు కూలి 600 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధిహామీ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఏడాదికి 200 రోజులు పని దినాలు కనిపించాలని అన్నారు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం గ్రామాల్లో ఉన్న సంపన్నులు కలిసి ఉపాధి హామీ పథకాన్ని నీరుగాచడానికి పథకం రద్దు చేయడానికి కుట్రలు ప్రయత్నం చేస్తుందని ఆరేపించారు. గత సంవత్సరం 98 వేల కోట్లు కేటాయించి ఈ సంవత్సరం 60 వేల కోట్లు కేటాయించడం ఎందుకు నిదర్శనం అన్నారు. రెండు పూట్ల కూలీలను పని చేయమనడం, గతంలో ఇచ్చిన టెంట్లు, మజ్జిగ, మంచినీరు తీసివేయడం ఇందుకు తార్కాణం అన్నారు. ఆన్లైన్లో మచ్చర్లు వేయడం, వేతన పంపిణీలో జాప్యం చేయటం, వంద రోజులు పని కల్పించకపోవడం, ఇవన్నీ పొమ్మనకొండ పొగ పెట్టడం అన్నట్లుగా ఉంది అన్నారు. ఈ పథకం నుండి మనకు మనమే తప్పుకునేటట్లు చేస్తున్నారు. ఉపాధి హామీ పనుల డిమాండ్ ల సాధనకై ఈ నెల 29వ తేదీ ఉదయం 10 గంటలకు బందరు కలెక్టర్ ఆఫీస్ వద్ద జరిగే సామూహిక రాయబారం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాలు పంపిణీ చేసారు. ఐక్యమత్యంతో మన కూలీలంతా ఏకమై ఈ పథకాన్ని అభివృద్ధి పరచుకోవాలని కోరారు.