సమావేశంలో మాట్లాడుతున్న కత్తి కళ్యాణ్
ప్రజాశక్తి-కనిగిరి: స్వయం సహాయక మహిళలకు జీవనోపాధి కల్పించాలని సమాఖ్య ఏరియా కోఆర్డినేటర్ కత్తి కళ్యాణ్ కోరారు. కనిగిరి మండల సమాఖ్య సమావేశం బుధవారం ఐకెపి కార్యాలయంలో అధ్యక్షురాలు కే నాగలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కత్తి కళ్యాణ్ మాట్లాడుతూ సుస్థిర జీవానోపాధుల స్వయం సహాయక సభ్యులకు అవగాహన కల్పించాలని అన్నారు. ప్రతి సభ్యులు 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు గ్రామ సంఘాలలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని కోరారు. కొత్తవారిని గుర్తించి వారికి జీవనోపాధిని కల్పించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఏపీఎం జీవరత్నం, సీసీలు బాషా, సుబ్రమణ్యం, జిలాని, శ్రీనివాసరావు, వజ్రమ్మ, ఎల్‌సి బాలసుబ్రమణ్యం పాల్గొన్నారు.










