Nov 02,2023 18:36

అన్నదానం చేస్తున్న దృశ్యం

అన్నదానం చేస్తున్న దృశ్యం
స్వీట్లు పంపిణీ
ప్రజాశక్తి-ఉదయగిరి:చంద్రబాబు విడుదల సందర్భంగా అన్న క్యాంటీన్‌ వద్ద స్వీట్లను పంచిన కాకర్ల ట్రస్ట్‌ అధినేత కాకర్ల సురేష్‌. గురువారం నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ నాయకులు ట్రస్ట్‌ వ్యవస్థాపకులు కాకర్ల సురేష్‌ నియోజకవర్గంలోని పేద ప్రజలకు ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ లో రుచికరమైన భోజనం తోపాటుగా ప్రతి ఒక్కరికీ స్వీటును పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్ర బాబు నాయుడు విడుదలతో అన్ని వర్గాల ప్రజలు టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. బాబు విడుదలతో వైసిపి ప్రభుత్వానికి వణుకు పుట్టిం దన్నారు. బాబు రాక జగన్‌ ప్రభుత్వం పతనానికి నాంది పలికిందని ధీమా వ్యక్తం చేశారు.