Aug 13,2023 23:57

ప్రజాశక్తి-రామచంద్రపురం పట్టణంలోని చెలికాని రామారావు స్మారక కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం దరిశి చెంచయ్యపై 'ఆయన జీవితమే ఒక సందేశం' పుస్తకాన్ని ఆదివారం ఆవిష్కరించారు. ఈ సభకుకు చెలికాని స్టాలిన్‌ అధ్యక్షత వహించారు. ఈ పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రజా నాట్యమండలి స్థాపకులు నల్లూరి వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. కోల్కతా ముందడుగు, ఐకా బాలాజీ గదర్‌ మహోద్యమం, చెంచయ్య పాత్ర అంశంపై ఆయన మాట్లాడారరు. భారత స్వాతంత్య్ర పోరాటంలో అలుపెరుగని యోధుడు, గదర్‌ పోరాటంలో దక్షిణా భారతదేశంల తెలుగు నేల మీద నుండి పాల్గొన్న ఒక్కేఒక్కడు దరిశి చెంచయ్య అన్నారు. చెంచయ్య 1890లో కనిగిరి ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారని, చిన్నతనంలోనే బ్రిటీష్‌ ప్రభుత్వ పీడనకు వ్యతిరేకంగా వందేమాతరం ఉద్యమం, స్వదేశీ ఉద్యమంలో పాల్గొన్నారని అన్నారు. సాయుధ పోరాటం ద్వారా బ్రిటీష్‌ వారిని దేశం నుండి తరిమికొట్టాలనే ఉద్దేశ్యంతో గదర్‌ పార్టీలో చెంచయ్య సభ్యునిగా చేరారన్నారు. స్వాతంత్య్రద్యమ చరిత్ర-చెంచయ్య కృషి అనే అంశంపై ఇండియన్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ కార్యదర్శి డి.సోమసుందర్‌ ప్రసంగించారు. కందుకూరి వీరేశలింగం గారి సంఘ సంస్కరణలు ప్రభావంతో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేసారని అన్నారు. మహిళలు, వితంతువులు హక్కులు కోసం నిరంతరం కృషి చేశారనిన్నారు. చెంచయ్య జీవితం-ప్రాసంగిత సందేశం అనే అంశంపై వీక్షణం పత్రిక సంపాదకులు ఎన్‌.వేణు గోపాల్‌ మాట్లాడారు. చెంచయ్యను ఆదర్శంగా తీసుకొని నేడు పాలకులు చేస్తున్న అన్యాయాలపై పోరాటం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల రచయిత గౌరవ్‌, పి.రాము, యు.గోపాల్‌, ప్రేమానందం, బి.సిద్ధూ, లెనిన్‌, సాయి, శారదా దేవి, బలరాం తదితరులు పాల్గొన్నారు