Mar 21,2023 23:03
satkaristunna eo

స్వామివారిని దర్శించుకున్న సినీ నటుడు సుమన్‌
ప్రజాశక్తి-మోపిదేవి
మోపిదేవిలోని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారిని ప్రముఖ సినీ నటుడు సుమన్‌ దర్శించుకున్నారు. మంగళవారం ఆలయానికి వచ్చిన ఆయన తొలుత నాగ పుట్టలో పాలు పోసి అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఏసి చక్రధర్‌రావు స్వామివారి చిత్రపటం, తీర్ధప్రసాదం అందజేసి సత్కరించారు. చల్లపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు రాజులపాటి కళ్యాణి, వైసిపి నాయకులు రాజులపాటి శివప్రసాద్‌ దంపతులు సుమన్‌ను దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు.