Aug 14,2023 22:47

ప్రజాశక్తి - మచిలీపట్నం అర్బన్‌ : ఆంధ్రప్రదేశ్‌ సీఐడి కార్యాల యంలో హెల్ప్‌ లైన్‌ నెంబర్‌ 1091 ప్రారంభించిన నేపధ్యంలో స్వాభిమాన్‌ ట్రాన్స్‌ జెండర్‌ పర్సన్స్‌ ప్రోటెక్షన్‌ హెల్ప్‌ లైన్‌ పోస్టరును జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జిల్లా ఎస్పీ పి జాషువా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ పోస్టర్లు జిల్లా పరిధిలో ఉన్న సబ్‌ డివిజన్‌ పోలీస్‌ స్టేషన్లలో ప్రదర్శించేలా అధికారులను ఆదేశించారు. ట్రాన్స్‌ జెండర్ల లింగ వివక్షతను అంతం చేసి, లింగ మార్పిడి వ్యక్తుల భద్రత, గౌరవాన్ని కాపాడటమే ఈ ప్రొటెక్షన్‌ హెల్ప్‌ లైన్‌ ముఖ్య ఉద్దేశం అన్నారు. ట్రాన్స్‌ జెండర్లపై జరుగుతున్న శారీరక హింస, వివక్షను నిరోధించడం, హక్కుల పరిరక్షణ, నేరాలకు సంబంధించిన కేసులను పర్యవేక్షించడం కొరకు కార్యక్రమాన్ని ప్రారంభిం చామని చెప్పారు. వివక్షకు గురవుతున్న, సమాజపరంగా సమస్యలు ఎదుర్కొంటున్న ట్రాన్స్‌ జెండర్లు ప్రొటెక్షన్‌ హెల్ప్‌ లైనుకు ఫిర్యాదు చేసి తగిన న్యాయం పొందవచ్చని తెలిపారు.