Apr 14,2023 22:43

matladutunna aparajitha singh

సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధనకు కృషి చేయాలి
కృష్ణాజిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ డాక్టర్‌ అపరాజితసింగ్‌
ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా)
జిల్లాలో ఫ్యామిలీ డాక్టర్‌ విధానం పటిష్టవంతంగా అమలు చేయాలని, నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలని జాయింట్‌ కలెక్టర్‌, ఇన్‌ చార్జి కలెక్టర్‌ డాక్టర్‌ అపరాజిత సింగ్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌ రెడ్డి శుక్రవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్‌ నిర్వహించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, నాడు-నేడు, ఫ్యామిలీ డాక్టర్‌ విధానం తదితర అంశాలపై సమీక్షించారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, ఇన్చార్జ్‌ కలెక్టర్‌ కలెక్ట రేట్‌ నుండి వీడియో కాన్ఫరెన్సులో పాల్గొని జిల్లా ప్రగతిని వివరించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి 8 అభివృద్ధి సూచికల్లో జిల్లా సాధించిన ప్రగతి జెసి వివరిస్తూ జిల్లాలో ఆధార్‌ సవీకరణ అంశంలో 85.66 శాతం లక్ష్య సాధన జరిగిందన్నారు. అనీమియా నివారణ చర్యల్లో భాగంగా 10-19 మధ్య వయస్సు గల పాఠశాల విద్యార్థినులు 36,237 మందిని అనీమియా పరీక్షలు నిర్వహించినట్లు, 10-19 మద్య వయస్సు గల సంక్షేమ హాస్టళ్ల విద్యారీనులు మొత్తం 3,204 మందికి గాను 2207 మందికి అనీమియా పరీక్షలు నిర్వహించామన్నారు. వీరిలో 1985 మంది బరువు తక్కువుగా ఉన్నట్లు గుర్తించి వారికి అవసరమైన పోష కాహారం అందిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలల్లో బాలికల టాయిలెట్స్‌ ఏర్పాటుకు సంబంధించి జిల్లాలో గల మొత్తం 1344 పాఠశాలల్లో 1308 పాఠశాలల్లో బాలికల టాయిలెట్స్‌ ఉండగా 1290 పాఠశాలల్లో ఫంక్షనింగ్‌ లో ఉన్నట్లు మిగతావి ఫంక్షనింగ్‌ లోకి తేవడం, బాలికల టాయిలెట్స్‌ లేని పాఠశాలలో నిర్మించాల్సివుందన్నారు. జిల్లాలో ఫ్యామిలీ డాక్టర్‌ విధానం పటిష్టవంతంగా అమలుకు చర్యలు తీసుకుంటున్నామని, వైద్యులు, సిబ్బంది. గ్రామాలు సందర్శించి వైద్య పరీక్షలు నిర్వహించడం ద్వారా డయాబెటిక్‌, అధిక రక్తపోటు గల వారిని, ఇవి రెండూ కలిగిన వారిని గుర్తించి వారికి అవసరమైన మందులు అందించి వ్యాధుల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కంటి వెలుగు మూడవ విడత క్రింద అవ్వా, తాతలకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి
అద్దాలు పంపిణీ చేయడంతో పాటు అవసరమైన వారికి శస్త్ర చికిత్సకు కూడ నిర్వహించడం ద్వారా ప్రభుత్వ లక్ష్యాలు సాధనకు కషి చేస్తున్నట్లు ఇప్పటి వరకు జిల్లాలో 50 శాతం ప్రగతి సాధించినట్లు, కంటి పరీక్షలు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలో నాడు-నేడు పథకం క్రింద పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, కిచెన్‌ షెడ్‌, ప్రహరీగోడల నిర్మాణం, రన్నింగ్‌ వాటర్తో టాయిలెట్స్‌ ఏర్పాటు, త్రాగునీరు సరఫరా, ఫర్నిచర్‌ ఏర్పాటు తదితర 11 రకాలైన మోలిక వసతుల అభివృద్ధికి సంబంధించి 166 అదనపు తరగతి గదుల నిర్మాణ పనుల పురోగతికి సంబంధించి 110 పనులు ప్రారంభమై వివిధ నిర్మాణా దశల్లో ఉన్నాయని తెలిపారు. కిచెన్‌ షెడ్ల నిర్మాణానికి సంబంధించి జిల్లాలో 238 పనులు మంజూరు కాగా, 140 పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ప్రహరీల నిర్మాణానికి సంబంధించి 154 పనులు మంజూరు కాగా, 100 పనులు ప్రారంభ మై వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయన్నారు. విద్యుదీకరణకు సంబంధించి 311 పనులు మంజూరు కాగా, 186 పనులు పురోగతిలో ఉన్నట్లు, తరగతి గదులు, టాయిలెట్స్‌ మరమ్మత్తు పనులకు సంబంధించి జిల్లాలో మంజూరైన 314 పనుల్లో 152 పనులు పురోగతిలో ఉన్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలో అన్ని పాఠశాలల్లో మే ఆఖరు నాటికి రాత్రి కాపలాదారును ఏర్పాటు చేయటానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యాహక్కు చట్టం అమలుకు సంబంధించి పేద విద్యార్థులకు ప్రయివేట్‌ పాఠశాలల్లో 25 శాతం సీట్లు కేటాయించే అంశంపై జిల్లాలో 272 రిజిస్టర్‌ ప్రయివేటు పాఠశాలల్లో 1వ తరగతిలో (25 శాతం సీట్లు) 2,777 అందుబాటులో ఉండగా 171 పాఠశాలల్లో 463 సీట్లకు పేర్లు నమోదు చేసుకోగా, 237 మంది అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లు ఎంపిక చేసుకున్నట్లు, ఈ నెల 18వ తేది మొదటి రౌండ్‌, 29వ తేది రెండవ రౌండ్‌ లాటరీ నిర్వహించి సీట్లు కేటాయించామన్నారు. వేసవిలో తీవ్ర ఎండలు, వడగాల్పులు కారణంగా పాఠశాలల్లో వాటర్‌ బెల్‌ రెండు, మూడు సార్లు అమలు చేయాలని, రైల్వే స్టేషన్లలలో, బస్టాండ్‌ లో ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయడం ఓఆర్‌ ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచడం చర్యలు చేపట్టాలన్నారు. సిపివో వై. శ్రీలత, డిఎల్‌ డివో సుబ్బారావు, ఐసిడిఎస్‌ పిడి ఎస్‌. సువర్ణ, డిఎంఅండ్‌ హెచో డా. గీతాబాయి, సమగ్ర శిక్షా సహాయ ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ శేఖర్‌, డిప్యూటి కలెక్టర్‌ ట్రైనీ చైతన్య వీసిలో పాల్గొన్నారు.