యర్రగొండపాలెం :యర్రగొండపాలెం పట్టణంలోని అంబేడ్కర్ నగర్ వివోఓ పరిధిలో గురువారం స్వయం సహాయక సంఘ మహిళలకు సుస్థిర జీవనోపాదుల కల్పన, ఆసక్తి కలిగిన లబ్దిదారుల ఎంపికపై అవగాహనా కార్యక్రమం నిర్వహింయారు. ఈ సందర్భంగా వైఎస్సార్ క్రాంతి పధం సీసీ నాగయ్య మాట్లాడుతూ సిఐఎఫ్, స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ రుణాలు తీసుకొని జీవనోపాదులు చేసుకుంటూ, ఆర్ధికంగా అభివద్ధి చెంది, తీసుకున్న రుణాలు సకాలంలో తిరిగి చెల్లించాలని తెలిపారు. ప్రతి నెల సంఘం సమావేశాలు జరుపుకోవాలని చెప్పారు. సంఘంలో జరిగిన లావాదేవీలు మొబైల్ బుక్ కీపింగ్‌లో నమోదు చేసుకోవాలన్నారు. సంఘాలన్ని ఏ గ్రేడ్‌లో వుండాలని తెలిపారు. అదే విధంగా గ్రామ సంఘం సమావేశాలు జరుపుకొవాలని తెలిపారు. ముందుగా పిఎంఎఫ్‌ఎంఈ లైవ్‌వి హెడ్స్, పిఎంఈజిపి జగనన్న బడుగు వికాసం, జగనన్న తోడులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సంఘం అధ్యక్షులు, సహాయక సంఘం మహిళలు, వివోఏ పాల్గొన్నారు.










