ప్రజాశక్తి ధర్మవరం టౌన్ : పట్టణంలోని శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం, సాయంత్రం చెన్నకేశవుడు సూర్య, చంద్రప్రభవాహనాలపై ఊరేగాడు. చెన్నకేశవుడి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి ఉదయం సూర్యప్రభ, సాయంత్రం చంద్రప్రభ వాహనాలపై భక్తులకు దర్శనం కల్పించారు. సూర్యప్రభ వాహనానికి ఉభయదాతలుగా గుద్దిటి నారాయణప్ప, బండ్లపల్లి వెంకటజయప్రకాశ్, అంబటిసతీశ్ కుమార్, కట్టాబాగ్యమ్మ మరియు కుమారులు, అన్నంలక్ష్మీనారాయణ, మల్లికార్జున, నీలయ్యగారి పణికుమార్,షర్మిల, జింకాచిన్నకంబయ్య కోటంక్రిష్ణమూర్తి, కోటం రవీంద్రనాథ్, బాబు కుటుంబసభ్యులు వ్యవహరించారు. చంద్రప్రభవాహనానికి ఉభయదాతలుగా వెంకటేశ్వరప్రసాద్, గోపాలక్రిష్ణయ్య కుమారులు వ్యవహరించారు. శనివారం ఉదయం సర్వభూపాల వాహనం, సింహవాహనాలలో స్వామివారిని ఊరేగిస్తారని ఆలయ కమిటీ చైర్మన్ దాశెట్టి సుబ్రమణ్యం, ఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు పొరాళ్లపద్మావతి, సత్రశాల సత్యనారాయణ, జగ్గాజయలక్ష్మీ, దాడితోట సునీత, సౌందర్యలహరి, గిర్రాజు మహాలక్ష్మీ, అన్నమయ్యసేవా మండలి అధ్యక్షుడు పొరాళ్లపుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.










