ప్రజాశక్తి - ఆదోని
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'జగనన్న ఆరోగ్య సురక్ష' వైద్య శిబిరాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్ రెడ్డి, సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ సూచించారు. 'జగనన్న ఆరోగ్య సురక్ష'లో భాగంగా ఆదోనిలోని అరుణ్ జ్యోతి నగర్ ప్రాథమిక ఆరోగ్య వైద్యశాల వద్ద మంగళవారం మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ప్రారంభించి ఏర్పాట్లను పరిశీలించారు. ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అక్కడ వైద్యులతో కంటి పరీక్ష చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రతి ఒక్కరికీ ఉచిత ఆరోగ్య సేవలు అందించాలన్న ఉద్దేశంతోనే ఇంటింటికీ వెళ్లి వైద్య పరీక్ష నిర్వహించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ... గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలను నిర్వహించాలని చెప్పారు. ప్రతి మండల, మున్సిపాలిటీలో రోజుకో శిబిరం చొప్పున నిర్వహిస్తున్నామని వైద్యాధికారులు తెలిపారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యమూ కలుగకుండా వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డికి సూచించారు. శిబిరంలో రోగులకు నిర్వహిస్తున్న పరీక్ష గదులను తనిఖీ చేస్తూ సంబంధిత మెడికల్ అధికారులు, సిబ్బందికి సూచనలు జారీ చేశారు. శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన న్యూట్రిషన్ కౌంటర్‌లో కూరగాయలను, ఆకుకూరలను, మిల్లెట్స్‌తో తయారు చేసిన వంటకాల ప్రదర్శనను పరిశీలించారు. మున్సిపల్ ఛైర్మన్ శాంత, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ సత్యవతి, మున్సిపల్ వైస్ ఛైర్మన్ నరసింహులు, కౌన్సిలర్ అశోక్, మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ కామాక్షి తిమ్మప్ప, రామలింగేశ్వర యాదవ్ పాల్గొన్నారు. కౌతాళం జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో సర్పంచి పాల్ దినకరన్ అధ్యక్షతన 'జగనన్న ఆరోగ్య సురక్ష' నిర్వహించారు. ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వైసిపి మండల కన్వీనర్ దేశాయి ప్రహ్లాద చారి, ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ నాగరాజు గౌడ్, నాయకులు వీరసేనారెడ్డి, ఏకం రెడ్డి, రామన్న గౌడ్, ఎంపిపి అమ్రేష్, జడ్‌పిటిసి రాధా ప్రియదర్శిని, కోఆప్షన్ సభ్యులు మాబు సాబ్, వైస్ ఎంపిపి బుజ్జి స్వామి, చౌదరి బసవరాజు, వడ్డే రాముడు, ఎంపిడిఒ సుబ్బరాజు, తహశీల్దార్ రామేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఆస్పరి మండలం ములుగుందం గ్రామంలో ఇఒఆర్‌డి నరసింహా రెడ్డి అధ్యక్షతన 'జగనన్న ఆరోగ్య సురక్ష' నిర్వహించారు. డిఎంహెచ్‌ఒ రామగిడ్డయ్య, డాక్టర్ రఘురాం రెడ్డి, దుర్గమ్మ, అంగన్వాడీ సూపర్‌వైజర్ పద్మావతి, పంచాయతీ కార్యదర్శులు జంప్లా నాయక్, శ్రీలక్ష్మీ, విఆర్‌ఒ సుప్రియ పాల్గొన్నారు. దేవనకొండ ఎంపియుపి పాఠశాల ఆవరణలో 'ఆరోగ్య సురక్ష' నిర్వహించారు. శిబిరంలో 450 మంది రోగులకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యాధికారులు విజరు కుమార్, చంద్రశేఖర్, అరుణ, జ్యోతి, లింగప్ప, కల్యాణ్, అతావుల్లా, సిహెచ్‌ఒ భాగ్యలక్ష్మి, ఇఒఆర్‌డి సూర్యనారాయణ, ఆరోగ్య సూపర్‌వైజర్లు హనుమంతమ్మ, పద్మావతి, శ్రీధర్, రంగస్వామి, పంచాయతీ కార్యదర్శులు అబ్దుల్ రహీం, రిబీక పాల్గొన్నారు. ఎమ్మిగనూరు పట్టణంలోని కర్నూలు బైపాస్ రోడ్డు (పాత షాదీఖానా) క్విబులా కాలనీలో అర్బన్ హెల్త్ సెంటర్‌లో 'జగనన్న ఆరోగ్య సురక్ష'ను ప్రారంభించారు. వైసిపి సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ... అందరికీ సంపూర్ణ వైద్యం అందించడమే 'జగనన్న ఆరోగ్య సురక్ష' ధ్యేయమని పేర్కొన్నారు. మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ రఘు, వైస్ ఛైర్మన్ నజీర్ అహ్మద్, కమిషనర్ గంగిరెడ్డి, నాయకులు బుట్టా రంగయ్య పాల్గొన్నారు. పెద్దకడబూరు మండలంలోని చిన్నతుంబలం గ్రామంలో 'జగనన్న ఆరోగ్యశ్రీ సురక్ష' నిర్వహించారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి ఆరోగ్య యువజన, వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ ఆరోగ్య సంరక్షణ పథకం కింద గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. అధికారులు వీరేంద్ర గౌడ్, ప్రభాకర్, శాంతి జ్యోతి పాల్గొన్నారు. మంత్రాలయంలోని రాఘవేంద్ర కాలనీలో ఉన్న వైఎస్‌ఆర్ హెల్త్ క్లినిక్‌లో 'జగనన్న ఆరోగ్య సురక్ష' ప్రారంభించారు. వైసిపి మండలాధ్యక్షులు భీమిరెడ్డి, ఇన్‌ఛార్జీ విశ్వనాథ్ రెడ్డిలు సర్పంచి భీమయ్యతో కలిసి అక్కడ ఏర్పాటు చేసిన పలు స్టాల్స్‌ను సందర్శించారు. తహశీల్దార్ చంద్రశేఖర్, ఎంపిడిఒ మణిమంజరి, ఇఒఆర్‌డి ప్రభావతి, ఐసిడిఎస్ సిడిపిఒ నాగమణి, సూపర్‌వైజర్ భాగ్యలక్ష్మి, ఎపిఒ తిమ్మారెడ్డి, వ్యవసాయ సలహా మండలి సభ్యులు మల్లికార్జున, సచివాలయ మండల కోకన్వీనర్ వికెసి.రాఘవేంద్ర ఆచారి, ఉప సర్పంచి హోటల్ పరమేష్, ఎంపిటిసి వెంకటేష్ శెట్టి, నాయకులు కృష్ణస్వామి, జనార్ధన్ రెడ్డి, శివకుమార్, భాస్కర్, వీరారెడ్డి, మారెప్ప, సల్మాన్, కయ్యూన్, డానియల్ పాల్గొన్నారు.










