Oct 12,2023 19:48

వైద్య పరీక్షలు చేయించుకుంటున్న ప్రజలు

ప్రజాశక్తి - చిప్పగిరి
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'జగనన్న ఆరోగ్య సురక్ష' ద్వారా గ్రామాల్లో ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపిపి హేమలత మారయ్య, సర్పంచి నీలకంఠ, సొసైటీ ఛైర్మన్‌ మల్లికార్జున, వైసిపి కన్వీనర్‌ జూటూరు మారయ్య, ప్రభుత్వ వైద్యాధికారి జమీల్‌ అహ్మద్‌ తెలిపారు. గురువారం డేగలహాల్‌ గ్రామంలో సర్పంచి నీలకంఠ అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శి నరసింహులు, డాక్టర్‌ జమీల్‌ అహ్మద్‌ ఆధ్వర్యంలో 'జగనన్న ఆరోగ్య సురక్ష' నిర్వహించారు. ప్రజలందరికీ వైద్య చికిత్సలు అందిస్తూ కావాల్సిన మందులను పంపిణీ చేశారు. కర్నూలు గౌరీ గోపాల్‌ ఆస్పత్రి నుంచి వచ్చిన సమతా రెడ్డి, హర్షవర్ధన్‌, మనోజ్‌ వైద్య పరీక్షలు నిర్వహించారు. దాదాపు 300 మంది వరకు వైద్య చికిత్సలు అందించారని అధికారులు తెలిపారు. వైద్య చికిత్సలు, మెడిసిన్‌ అందించడం ద్వారా మహిళలు, పురుషులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని సర్పంచి నీలకంఠ తెలిపారు. ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో న్యూట్రిషన్‌ స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. సిహెచ్‌ఒ వెంకటేశ్వర్లు, మహిళా సంరక్షకులు శాంతి, అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ వంశీ, ఎఎన్‌ఎంలు సువర్ణ, పార్వతి పాల్గొన్నారు. ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో సర్పంచి జయమ్మ ఆధ్వర్యంలో 'జగనన్న ఆరోగ్య సురక్ష'ను డిఎల్‌డిఒ నాగేశ్వరరావు పరిశీలించారు. డాక్టర్‌ రఘురాం రెడ్డి మాట్లాడుతూ... 345 మందికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు, అద్దాలు పంపిణీ చేశామని తెలిపారు. జగనన్న సచివాలయ మండల కన్వీనర్‌ బసవరాజు, డిప్యూటీ తహశీల్దార్‌ గాయత్రి, ఎంపిటిసి రాధాకృష్ణ, సైకాలజిస్ట్‌ గీతావాణి, మాధవి లత, డాక్టర్లు బాల కృష్ణారెడ్డి, ప్రణరు, పంచాయతీ కార్యదర్శి నబి సాబ్‌, విఆర్‌ఒ గోవిందరాజులు పాల్గొన్నారు.