Oct 10,2023 19:42

చిప్పగిరిలో మహిళకు వైద్య చికిత్సలు అందిస్తున్న వైద్యులు

ప్రజాశక్తి - చిప్పగిరి
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'జగనన్న ఆరోగ్య సురక్ష' ద్వారా గ్రామాల్లోని ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందుతాయని సర్పంచి తిమ్మాపురం వెంకటలక్ష్మి, ఎంపిడిఒ కొండయ్య, ప్రభుత్వ వైద్యాధికారి జమీల్‌ అహ్మద్‌ తెలిపారు. మంగళవారం ఏరూరు గ్రామంలో సర్పంచి వెంకటలక్ష్మి అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శి జయరాం నాయక్‌, డాక్టర్‌ జమీల్‌ అహ్మద్‌ ఆధ్వర్యంలో 'జగనన్న ఆరోగ్య సురక్ష' నిర్వహించారు. ప్రజలందరికీ వైద్య చికిత్సలు అందిస్తూ కావాల్సిన మందులను అందజేశారు. కర్నూలు గౌరీ గోపాల్‌ ఆస్పత్రి నుంచి వచ్చిన ఆంజనేయులు, కీర్తి ప్రియ, మురళీమోహన్‌, ఆలూరు శేఖర్‌ వైద్య పరీక్షలు నిర్వహించారు. దాదాపు 600 మందికి వైద్య చికిత్సలు అందించారని అధికారులు తెలిపారు. వైద్య చికిత్సలు, మందులు అందించడం ద్వారా మహిళలు, పురుషులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని సర్పంచి వెంకటలక్ష్మి, భర్త సేనాపతి తెలిపారు. ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో న్యూట్రిషన్‌ స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. పంచాయతీ కార్యదర్శి ప్రమీల, సిహెచ్‌ఒ వెంకటేశ్వర్లు, మహిళా సంరక్షకులు సుమలత, అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ సుబ్బరాయుడు, ఎఎన్‌ఎంలు సువర్ణ, పార్వతి పాల్గొన్నారు. ఆస్పరి మండలం ముత్తుకూరు గ్రామంలో 'జగనన్న ఆరోగ్య సురక్ష'ను ఎంపిడిఒ రాణెమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. సర్పంచి తోయాక్షప్ప, డాక్టర్‌ రఘురాం రెడ్డి, సైకాలజిస్ట్‌ గీతావాణి, డాక్టర్లు దుర్గాబాయి, మహేష్‌, పంచాయతీ కార్యదర్శులు జంప్ల నాయక్‌, దివ్యశ్రీ, విఆర్‌ఒ హరికృష్ణ, ఎఎన్‌ఎం వరలక్ష్మి, వైసిపి నాయకులు వేణు పాల్గొన్నారు. గోనెగండ్ల మండలంలోని బి.అగ్రహారం గ్రామంలో 'జగనన్న ఆరోగ్య సురక్ష'ను నిర్వహించారు. తహశీల్దార్‌ వేణుగోపాల్‌, ఎంపిడిఒ ప్రవీణ్‌ కుమార్‌, మండల స్పెషల్‌ ఆఫీసర్‌, జిల్లా మలేరియా నివారణాధికారి డాక్టర్‌ నూకరాజు, సర్పంచి రంగారెడ్డి, ఎంపిడిఒ కార్యాలయ ఎఒ బాబు భాస్కర్‌, పంచాయతీ కార్యదర్శి టి.వెంకటేష్‌, వైద్యులు రవళి, రుక్సానా, అపర్ణ, సింధూర పాల్గొన్నారు.

ఆస్పరిలో గర్భిణులను పరీక్షిస్తున్న డాక్టర్‌ గీతావాణి
ఆస్పరిలో గర్భిణులను పరీక్షిస్తున్న డాక్టర్‌ గీతావాణి