మనుషుల కంటే సూపర్ ఇంటెలిజెంట్... ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అత్యంత శక్తివంతమైనదని పరిశోధకులు చెబుతున్నారు. కానీ దీన్ని ఒక్కసారి క్రియేట్ చేస్తే.. ఆ తర్వాత దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం.. అసాధ్యమని చెబుతున్నారు. దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే.. అచ్చం హాలీవుడ్ మూవీ 'ది టెర్మినేటర్' లానే పనిచేస్తుందట. దీనికి సంబంధించిన అధ్యయనం కూడా జరిగింది. ఏఐ డెవలప్ చేయాలన్నా.. దాన్ని విస్తరించాలన్నా.. అంత సులువైన విషయం కాదని దీనిపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలే చెబుతున్నారు. ప్రపంచాన్ని నియంత్రించే ఒక సూపర్ ఇంటెలిజెంట్ మెషీన్ సైన్స్ ఫిక్షన్ లాగా అనిపిస్తుందని పరిశోధనా అధ్యయన బందానికి నేతత్వం వహించిన మాన్యువల్ సెబ్రియన్ చెప్పారు. ఒక మిషన్ క్రియేట్ చేసిన తర్వాత.. అది ఒకవేళ మనుషుల కంట్రోల్ దాటిపోతే.. అదేలా ప్రవర్తిస్తుందో చెప్పలేమంటున్నారు. అది సష్టించే వినాశనం ఏ స్థాయిలో ఉంటుందో కూడా ఊహించలేమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి అవాంతరాలు రాకుండా ఒక మిషన్‌ను నిరోధించడానికి ఏదైనా కంటైనర్ అల్గోరిథంలను ఉపయోగించవచ్చా? అనే ప్రశ్నతో అధ్యయనం కొనసాగింది. అసలు సమస్య ఏమిటంటే.. టెక్నాలజీ ఎంతగా అభివద్ధి చెందిందంటే క్రియేట్ చేసిన మిషన్ లెర్నింగ్ ఆపడానికి అల్గోరిథంలు అంతగా పవర్ ఫుల్ కాదని అంటున్నారు. అన్ని మిషన్లకు ఉపయోగించగల ఒకే అల్గోరిథం అసాధ్యమని చెబుతున్నారు.
ప్రతి వ్యక్తి వ్యవస్థకు వేర్వేరు కంటైనర్ అల్గోరిథంలను అభివద్ధి చేయాల్సి ఉంటుందని ట్యూరింగ్ 1936 నాటికి తేల్చారు. ప్రస్తుత కంప్యూటర్లు, అందులోని ప్రోగ్రామ్స్‌లో అత్యాధునిక టెక్నాలజీ పెరిగినందున దాన్ని అర్థం చేసుకోవడం అంత తేలిక కాదంటున్నారు. అందుకే.. ఇలాంటి సూపర్ ఏఐ సిస్టమ్‌ను క్రియేట్ చేయకపోవడమే మంచిదని అధ్యయన పరిశోధకుల్లో ఒకరైన ఇయాద్ రవావహన్ అభిప్రాయపడ్డారు. ఏదిఏమైనా.. సూపర్ పవర్ ఏఐ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ముందు మనుషులంతా పూర్తిగా బలహీనులేనని అధ్యయనపరంగా తేలింది.










