పంటను పరిశీలిస్తున్న ఎఒ విష్ణుప్రియ
ప్రజాశక్తి-గిద్దలూరు రూరల్
ఉద్యానవన శాఖ అరోమా మిషన్ ద్వారా సుగంధ పంటల పెంపకము కార్యక్రమము చేపట్టినట్లు ఉద్యానవన శాఖ ఎఒ పి విష్ణు ప్రియ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా గిద్దలూరు మండలం గడికోట గ్రామములో సాగు అవుతున్న నిమ్మగడ్డి పొలాన్ని సాగు చేయాలనుకునే రైతులతో కలసి సందర్శించారు. నిమ్మగడ్డి పంట సాగు చేసుకోవాల్సిన విధానము, నిమ్మగడ్డి నుంచి నూనెను తయారు చేసుకునే విధానం గురించి నిమ్మగడ్డి సాగు చేస్తున్న రైతు రంగస్వామి రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపట్నం హార్టికల్చర్ ఏఒ తేజ, ఆర్‌బికె సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.










