Sep 18,2023 00:41

కేక్‌ను కట్‌ చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ నేతలు

ప్రజాశక్తి-డుంబ్రిగుడ:-మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ పార్టీ సిడబ్ల్యుసి శాశ్వత మెంబర్‌ టిసుబ్బిరామిరెడ్డి జన్మదిన వేడుకలను మండలంలోని గుంటసీమ గ్రామంలో ఆ పార్టీ ఆదివాసి రాష్ట్ర చైర్పర్సన్‌ పి శాంతకుమారి ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జన్మదిన కేక్‌ కట్‌ చేసి కార్యకర్తలకు అమే పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సుబ్బరామిరెడ్డి ప్రజలకు ఎంతో సేవలు అందించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రతినిధి టీ.చిన్నస్వామి, స్థానిక మండల అధ్యక్షుడు జి.జగన్నాథం పాల్గొన్నారు.