ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్ : సత్యసాయి 12వ ఆరాధన ఉత్సవాలు సోమవారం జరగనున్నాయి. ఆరాధన ఉత్సవాల్లో భాగంగా హిల్ వ్యూ స్టేడియంలో తగిన ఏర్పాట్లను ట్రస్టు చేపట్టింది. స్టేడియంలో 10 గంటలకు భక్తులకు పేదలకు అన్న ప్రసాదములతో పాటు నూతన వస్త్రాలు పంపిణీ చేయనున్నారు. అందుకు తగిన ఏర్పాట్లను సత్యసాయి ట్రస్టు ప్రతినిధులతో పాటు డీఎస్పీ యశ్వంత్ పరిశీలించారు. కరోనా కారణంగా గత నాలుగేళ్లుగా ఆరాధన ఉత్సవాలు జరగలేదు. పుట్టపర్తి పరిసర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు ప్రజలు పాల్గొననున్నారు. సాయి కుల్వంత్ హాల్లో వేద పఠనం ట్రస్టు ప్రతినిధులు ప్రసంగం, భజనలు 10 గంటలకు ముగియగానే స్టేడియంలో ప్రసాదాలు, వస్త్రాలు పంపిణీ ఉంటుందన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డీఎస్పీ, ఇద్దరూ సిఐలు, ఏడుగురు ఎస్‌ఐలు, 22 మంది హోంగార్డులు, 400 మంది కానిస్టేబుళ్లతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.










