ప్రజాశక్తి-ఆలూరు
వైసిపి అధిష్టానం ఆదేశిస్తే ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తామని ఆస్పరి మాజీ జడ్‌పిటిసి బొజ్జమ్మ తెలిపారు. శుక్రవారం బొజ్జమ్మ, మాజీ ఎంపిపి రామచంద్ర నాయుడు ఎల్లార్తి దర్గాను దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో ఆలూరు గెస్ట్‌హౌస్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. నియోజకవర్గంలో వైసిపి అభివృద్ధికి కృషి చేస్తామని, ప్రాణం ఉన్నంత వరకు పార్టీలోనే ఉంటామని తెలిపారు. గత టిడిపి ప్రభుత్వంలో తమ సేవలను గుర్తించలేదన్నారు. శత్రువులున్న చోట తాము ఉండలేమన్నారు. అభిమానులు, శ్రేయోభిలాషులు, కార్యకర్తల అభీష్టం మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసిపి కండువా వేసుకున్నామని తెలిపారు. నియోజకవర్గ బాధ్యతలు చూసుకోమని ముఖ్యమంత్రి తెలిపారన్నారు. దేవనకొండలో వైసిపి కార్యక్రమంలో పాల్గొనడం లేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు తన తండ్రిని చంపిన వారితో ఎలా తిరుగుతామని తెలిపారు. నియోజకవర్గ ప్రజలు, పెద్దలు తమ ఇంటి ఆడపిల్లను ఆదరించి ఆశీస్సులు అందించాలని కోరారు.
ఆలూరు గెస్ట్‌హౌస్‌లో ఉన్న బొజ్జమ్మ, రామచంద్ర నాయుడు










