డేగలహాల్‌లో మిరప పంటను పరిశీలిస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్త రమేష్ నాయక్
ప్రజాశక్తి - చిప్పగిరి
మిరప పంటలో అధిక దిగుబడులు పొందడానికి సస్యరక్షణ మెళకువలు పాటించాలని ఎమ్మిగనూరు కెవికె నుంచి వచ్చిన శాస్త్రవేత్త డాక్టర్ రమేష్ నాయక్ రైతులకు సూచించారు. మంగళవారం అగ్రికల్చర్ అసిస్టెంట్లు సుబ్బరాయుడు, వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఏరూరు, డేగలహాల్ గ్రామాల్లో పత్తి పంటలో తీసుకోవాల్సిన మెళకువలపై రైతులకు డాక్టర్ రమేష్ నాయక్, ఆర్టికల్చర్ అధికారి ఇందిరా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వర్షాలు లేకపోవడంతో మిరప పంటలో చాలా అంటురోగాలు వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపారు. తగిన జాగ్రత్తలతో వ్యవసాయ అధికారుల సూచనల మేరకు మోతాదు మించకుండా నీళ్ల మందులను స్ప్రే చేయాలన్నారు. రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి కృత్రిమ ఎరువులను వాడడం రైతులు అలవాటు చేసుకోవాలని సూచించారు.










