ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగతనం చేయడాన్ని నిరసిస్తూ ఏపీ పంచాయతీ రాజ్ చాంబర్ రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల వద్ద నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని సర్పంచ్ లు జిల్లా కలక్టర్ పి.రాజా బాబుకి స్పందనలో వినతి పత్రం అందజేసి, అనంతరం ఆయన ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆం.ప్ర. పంచాయితీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వై.వి.బి.రాజేంద్రప్రసాద్, ఉమ్మడి కృష్ణాజిల్లా అధ్యక్షులు గోలి వసంతకుమార్, మరియు ముల్లంగి రామకృష్ణారెడ్డి, గళ్ళా తిమోతి, కాగిత గోపాలరావు, నిర్మల, ముప్పునేని రవి ప్రసాద్, మండలి ఉదయభాస్కర్, అంకం మారుతీరావు, పలువురు సర్పంచ్ లు ఉన్నారు.










