మాట్లాడుతున్న పరిశీలనాధికారి సుధీర్ బాబు
మాట్లాడుతున్న పరిశీలనాధికారి సుధీర్ బాబు
సర్వే నమూనా పరిశీలన
నెల్లూరు-జిల్లా కలువాయి:మండలంలోని బివిఎన్‌ఆర్ హైస్కూల్ ప్లస్‌లో 6, 9తరగతుల జరుగుతున్న స్టేట్ ఎడ్యుకేషన్ అచీవ్మెంట్ సర్వే నమూనా పరీక్షను పరిశీలనాధికారి సుధీర్ బాబు పరిశీలించారు. అనంతరం బివిఎన్‌ఆర్ హైస్కూల్ ప్లస్ జూనియర్ బాలికల కళాశాలలో విద్యార్థినులకు కెరీర్ గైడెన్స్, విద్యా విషయాలలో బాలికలు ఎలా రాణించాలి, ముందడుగు వేయాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు మరింత వసతులు అవసరమని జిల్లా అధికారి దష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి-2 జి శేషగిరిరావు. హై స్కూల్ ప్లస్ ఉపాధ్యాయులు ప్రసాద్ రావు, రాంబాబు, కష్ణయ్య, శ్రీనివాసులు, ఓబులేసు, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.










