saraswathi pooja
సరస్వతి పూజ
ప్రజాశక్తి - మొవ్వ
పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో కూచిపూడిశ్రీ సిద్ధేంద్ర జిల్లా ప్రజా పరిషత్ ఓరియంటల్ హైస్కూల్‌లో శుక్రవారం సరస్వతీ దేవి పూజ చేయించారు. హెచ్.ఎం అన్నే లక్ష్మీ కుమారి, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉయ్యూరు లైన్ ఇన్‌స్పెక్టర్ చిమటా శివ వేణుగోపాల శ్రీనివాసరావు, ఆదిలక్ష్మి దంపతులు పరీక్షలకు అవసరమైన పెన్నులు, పరీక్ష ప్యాడ్లు, స్కేలు తదితర స్టేషనరీ సామాగ్రిని విద్యార్థులకు అందజేశారు.










