Apr 15,2023 22:42

hussen

సరసమైన ధరలకే నాణ్యమైన కలప విక్రయం
బిస్మిల్లా టింబర్‌ డిపో అధినేత సయ్యద్‌ హుస్సేన్‌
ప్రజాశక్తి-పమిడిముక్కల
నాణ్యతా ప్రమాణాలతో కూడిన కలపకు సరసమైన ధరలకు వినియోగదారులకు అందజేస్తున్నామని బిస్మిల్లా టింబర్‌ డిపో అధినేత సయ్యద్‌ హుస్సేన్‌ చెప్పారు. పమిడిముక్కల మండలంలోని తాడంకిలోని టింబర్‌డిపోలో ఆయన ప్రజాశక్తికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. టేకు, వేప, వెంగిస, మామిడి తదితర కలపను విక్రయిస్తున్నామని చెప్పారు. తాము టింబర్‌ డిపో ప్రారంభించిన నాటి నుంచి నాణ్యమైన కలపనే విక్రయిస్తున్నామన్నారు. నాటి నుంచి నేటి వరకూ అదే నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నామన్నారు. కృష్ణాజిల్లా, ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాలతోపాటుగా బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల నుంచి కూడా ఖాతాదారులు వచ్చి తమ కలపను కొనుగోలు చేస్తున్నారన్నారు. నాణ్యమైన కలపను వినియోగదారులకు అందజేస్తూ వారి మన్ననలను పొందుతున్నామన్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కొద్దిగా మందగించడంతో తక్కువ వ్యాపారం జరుగుతోందన్నారు. అది పుంజుకుంటే కలప వ్యాపారం కూడా బాగా పెరుగుతుందన్నారు. తమ వద్ద బర్మాటేకు కూడా అందుబాటులో ఉందని చెప్పారు. సరుకు విషయంలో ఎలాంటి రాజీ లేకుండా నాణ్యమైన కలపను అందజేస్తున్నామనీ, అందువల్ల ఏటేటా తమకు ఆదరణ మరింతగా పెరుగుతోందన్నారు. తమ వద్ద కార్మికులకు కూడా మంచి ఉపాధిని కల్పిస్తున్నామన్నారు. ఆధునిక పరికరాలు రావడంతో చెక్క నైపుణ్యం కలిగే విధంగా తయారు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం కలప వ్యాపారులకు జీఎస్టీ విషయంలో కొంతమేర రాయితీ ఇస్తే బాగుంటుందన్నారు.