Aug 08,2023 16:46

మృతదేహానికి నివాళులర్పిస్తున్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

సర్పంచ్ భర్త మృతి
నివాళులర్పించిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బైరెడ్డి శబరి
ప్రజాశక్తి - పగిడ్యాల

     మండలంలోని నెహ్రు నగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కూరాకుల రాజేశ్వరి భర్త కూరాకుల తిక్క స్వామి బ్రెయిన్ స్ట్రోక్ తో మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. సర్పంచ్ కూరాకుల రాజేశ్వరి భర్త కూరాకుల తిక్క స్వామి ఆదివారం  తెల్లవారుజామున బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కర్నూల్ లోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తిక్క స్వామి మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర బీజేవైఎం అధ్యక్షురాలు బైరెడ్డి శబరి నెహ్రూ నగర్ గ్రామానికి చేరుకొని తిక్క స్వామి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మాజీ సింగల్ విండో అధ్యక్షులు కట్టుబడి శ్రీనివాస నాయుడు మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తిక్క స్వామి కుటుంబ సభ్యులను ఓదార్చారు. భర్త చనిపోవడంతో సర్పంచ్ కూరాకుల రాజేశ్వరి కన్నీరు మున్నిరై విలపించారు.