ప్రజాశక్తి - చింతలపూడి
పనిపట్ల అంకితభావం కలిగిన ఉపాధ్యాయురాలు దాసరి సరోజిని మృతి చెందడం బాధాకరమని చింతలపూడి బాలికోన్నత పాఠాశాల ప్రధానోపాధ్యాయులు చక్రదరరావు తెలిపారు. స్థానిక బాలకోన్నత పాఠశాల చింతలపూడిలో తెలుగు భాషా ఉపాధ్యాయురాలిగా పనిచేయుచున్న దాసరి సరోజినీ శుక్రవారం ఉదయం ఆకస్మికంగా మృతి చెందారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం మాట్లాడుతూ వీరు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, వీరి స్వగ్రామం కృష్ణా జిల్లా మచిలీపట్నం అని తెలిపారు. 2016 డిఎస్‌సిలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించి, మొదటగా కైకలూరులో పనిచేసి, 2019 ఫిబ్రవరిలో బదిలీపై జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల చింతలపూడి వచ్చారని అన్నారు. ఆమెకు ఎంతో భవిష్యత్తు కళ్ల ముందు ఉండగా ఇలాంటి దుర్ఘటన జరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.










