ముంబయి : ఈ మధ్యలో కాస్త వెనకడుగు వేసినట్లు కనిపించినప్పటికీ ...మోటోరోలా కొత్త ఫీచర్లతో నయా ఫోన్లను మార్కెట్లలోకి దింపింది. రెడ్మీ, వివో,షియోమీ,ఒప్పొ వంటి సంస్థలకు గట్టిపోటీనిచ్చేందుకు సిద్ధమయ్యింది. దీనిలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో మార్కెట్ విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా భారత మార్కెట్లోకి రెండు కొత్త మోడల్స్ ను విడుదల చేసింది. భారత్లో మార్కెట్ పెంచుకునేందుకు అత్యాధునిక ఫీచర్స్తో ఫోన్లను రూపొందించినట్లు సంస్థ వెల్లడించింది. మోటోరోలా జీ సిరీస్ నుంచి మరో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను తీసుకురాబోతోంది. రెడ్మీ నోట్ 10 ప్రో మాక్స్, రియల్ మీ 8 ప్రోకి పోటీగా మోటో జి 60, మోటో జి 40 ఫ్యూజన్ పేర్లతో వీటిని భారత మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ నెల 20 నుండి ఈ కామర్స్ సంస్థల్లో ఈ ఫోన్లు లభించనున్నాయి. మరీ వాటి ఫీచర్స్ పై ఓ లుక్కేసేయండి.












