శ్రీవారి ఆలయం మూసివేత
పాక్షిక చంద్ర గ్రహణం
శ్రీవారి ఆలయం మూసివేత
ప్రజాశక్తి- తిరుమల: పాక్షిక చంద్రగ్రహణం కారణంగా శనివారం సాయంత్రం శ్రీవారి ఆలయంలో కైంకర్యాలు, ఏకాంత సేవ పూర్తి చేసుకొని రాత్రి 7.15 గంటలకు ఆలయ తలుపులు మూసివేయనట్లు ఆలయ ప్రధానోర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు. గ్రహణం అర్ధరాత్రి 1.05 నుంచి 2.22 గంటలకు నిర్దేశించినట్లు చెప్పారు. గ్రహణ సమయానికి ఏడు గంటల ముందు శ్రీవారి ఆలయం మూసివేయడం జరుగుతుందన్నారు. గ్రహణం పూర్తి అయ్యాక ఉదయం పుణ్యాహవచనం, శుద్ధి కార్యక్రమాలు పూర్తిచేసి సుప్రభాత సేవతో ఆలయంలో యథావిధిగా కైంకర్యాలు, భక్తుల దర్శనాలు మొదలవుతుందని తెలిపారు. పాక్షిక గ్రహణం కారణంగా శనివారం ఐదు గంటలకే తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రాన్ని మూసివేయడం జరిగిందని తెలిపారు.










