ప్రజాశక్తి - మంత్రాలయం
ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన శ్రీరాఘవేంద్ర స్వామి మఠంలో పీఠాధిపతులు శ్రీసుభుదేంధ్రతీర్థులు చేపట్టిన చాతుర్మాస్య దీక్షను కొండాపురం ఆంజనేయస్వామిని దర్శించుకుని సీమోల్లంగణ చేశారు. శుక్రవారం శ్రీమఠంలో రాఘవేంద్రుని ఆరాధ్య దైవమైన మూల రాములకు విశిష్ట పూజలు నిర్వహించారు. అనంతరం రాఘవేంద్రుని మూల బృందావనాన్ని దర్శించుకుని నైవేధ్య సమర్పణతో మంగళ హారతులు ఇచ్చారు. సాయంత్రం శ్రీమఠం ప్రాకారం నుంచి పీఠాధిపతులు శ్రీసుభుదేంధ్రతీర్థులు పల్లకిలో ఆశీనులు చేసి బయట ఆవరణలోకి మోసుకొచ్చారు. అనంతరం వాహనంలో కొండాపురం ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. రాఘవేంద్ర సర్కిల్ చేరుకున్న పీఠాధిపతులను ప్రత్యేకంగా విద్యుద్దీపాలతో అలంకరించిన వాహనంలో కూర్చోబెట్టి మేళతాళాలు, మంగళ వాయిధ్యాల నడుమ భక్త జనులు, శ్రీమఠం సిబ్బంది ఆధ్వర్యంలో శ్రీమఠం వరకు ఊరేగించారు. ఈ సందర్భంగా స్థానికులు పీఠాధిపతులకు పూలమాలలు వేసి నమస్కరించుకున్నారు. శ్రీమఠం చేరుకున్న పీఠాధిపతులను పండితుల వేద మంత్రాల నడుమ శ్రీమఠం సిబ్బంది గురువందన కార్యక్రమంలో భాగంగా తులాభారం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు మాట్లాడారు. శ్రీమఠం అభివృద్ధి వైపు అడుగులు వేయిస్తూనే ఉందని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలుగకుండా, అన్ని సౌకర్యాలతో, సేవలతో సిబ్బంది మన్ననలు పొందుతున్నారని తెలిపారు. ఎఎఒ మాధవశెట్టి, మేనేజర్లు ఎస్‌కె.శ్రీనివాసరావు, వెంకటేష్ జ్యోషి, ఆధ్యాత్మిక అభివృద్ధి అధికారి శ్రీపతి ఆచార్, అసిస్టెంట్ మేనేజర్ ఐపి.నరసింహమూర్తి, ఇఇ సురేష్ కోనాపూర్, సూపరింటెండెంట్ పురాణిక్ రాఘవేంద్ర, ద్వారపాలకులు అనంతస్వామి, పవన్ ప్రకాష్ రావు, భీమారావు పాల్గొన్నారు.
ప్రత్యేక వాహనంలో ఊరేగుతున్న పీఠాధిపతులు










