Jul 31,2023 20:37

హుండీని లెక్కిస్తున్న సిబ్బంది

ప్రజాశక్తి - మంత్రాలయం
ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన శ్రీరాఘవేంద్రస్వామి మఠం హుండీ ఆదాయం లెక్కింపు ప్రక్రియ పూర్తయినట్లు శ్రీమఠం మేనేజర్‌ ఎస్‌కె.శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాఘవేంద్రస్వామి దర్శనార్థమై దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మంత్రాలయం వచ్చిన భక్తులు హుండీలో వేసిన 34 రోజుల ఆదాయాన్ని లెక్కించినట్లు తెలిపారు. నగదు రూపంలో రూ.3,76,67,469, బంగారం 99 గ్రాములు, వెండి 940 గ్రాములు వచ్చినట్లు పేర్కొన్నారు. దేవదాయ శాఖ అధికారులు, శ్రీమఠం అధికారులు, సేవాదారుల సమక్షంలో హుండీ లెక్కించినట్లు తెలిపారు.