Oct 18,2023 22:22

శ్రీ సత్య ఎలక్ట్రానిక్స్‌ షోరూం ప్రారంభం

శ్రీ సత్య ఎలక్ట్రానిక్స్‌ షోరూం ప్రారంభం
ప్రజాశక్తి - తిరుపతి సిటీ
తిరుపతిలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సత్య ఎలక్ట్రానిక్స్‌ షోరూంను ప్రముఖ విద్యా సంస్థల అధినేత, ప్రొప్రైటర్‌ రాజగోపాల్‌ నాయుడు, శ్రీ సత్య ఎమ్‌డి జాన్స్‌ బుధవారం ప్రారంభించారు. తిరుమల బైపాస్‌ రోడ్‌ లోని ఎస్కే ఫాస్ట్‌ ఫుడ్‌ సమీపంలో ఏర్పాటు చేసిన షో రూమ్‌ వద్ద వారు విలేకరులతో మాట్లాడుతూ తమిళనాడులో అతి తక్కువ కాలంలోనే శ్రీ సత్య వినియోగదారుల మన్ననలు పొందిందన్నారు. తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో 225 షోరూమ్‌ లతో, ఆంధ్రప్రదేశ్లో నాలుగు షోరూమ్‌లను ఇప్పటికే ఏర్పాటు చేశామన్నారు. ఐదవ షోరూమును బుధవారం ప్రారంభిస్తున్నామని తెలిపారు. మరో షోరూమ్‌ను తిరుపతిలోనే అతి త్వరలో ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఇక్కడ అనేక రకాల ఎలక్ట్రానిక్‌ వస్తువులు అతి తక్కువ ధరలకు లభ్యమవుతాయన్నారు. టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మిషన్లు, మొబైల్‌ ఫోన్లు, మిక్సీలు, ఎయిర్‌ కూలర్లు లభిస్తాయన్నారు. షోరూం ప్రారంభం సందర్భంగా 15వేల రూపాయలకు మించి కొనుగోలు చేసిన వారికి ఒక బంగారు కాయిన్‌ ఉచితంగా అందజేస్తున్నట్లు వెల్లడించారు. దసరా పండుగను పురస్కరించుకొని శ్రీ సత్యాలో కాంబో ప్యాక్‌ను అందుబాటులో ఉంచామన్నారు. ఆయా బ్రాండ్‌ లను బట్టి, ప్రత్యేక రాయితీలను అందిస్తామన్నారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపతి కార్పొరేషన్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ యువ అవినాష్‌, కార్పొరేటర్‌ శేఖర్‌ రెడ్డి, ఆ షోరూం జనరల్‌ మేనేజర్‌ సెందిల్‌, రోషన్‌, ఏజీఎం ఆనంద్‌ పాల్గొన్నారు.