హిందీ దివస్ గురించి విద్యార్థులకు వివరిస్తున్న శ్రీ చైతన్య ఎజిఎం సుబ్బారెడ్డి
అనంతపురం : అనంతపురం నగరంలోని హౌసింగ్ బోర్డ్ ఏటీపీ-8 శ్రీ చైతన్య బ్రాంచిలో హిందీ దివస్‌ను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య పాఠశాలల ఏజీఎం సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందీ దివస్‌ను ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14వ తేదీన జరుపుకుంటామన్నారు. హిందీ జాతీయ భాష అన్నారు. ప్రతి ఒక్కరూ హిందీని నేర్చుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులు పలు సాంస్కతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ నేత్రావతి, డీన్ అరుణ్‌కిరణ్, కోఆర్డినేటర్ తిరుమలేశ్వర్, సి బ్యాచ్ ఇన్‌ఛార్జి గంగాధర్, ప్రైమరీ ప్రీ ప్రైమరీ ఇన్‌ఛార్జి దేవికృప, హిందీ ఉపాధ్యాయులు నాజియా, ఇమ్రాన్, శ్రీదేవి, సుమీ తదితరులు పాల్గొన్నారు.










