శ్రీ చైతన్య విద్యార్థులకు కరాటేలో పతకాలు
ప్రజాశక్తి-హనుమాన్ జంక్షన్(గన్నవరం)
రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో హనుమాన్ జంక్షన్‌కు చెందిన శ్రీ చైతన్య విద్యార్థులు బహుమతులు సాధించడం అభినందనీయమని హెచ్‌ఎం. రాజేష్ అన్నారు. గురువారం స్కూలులో జరిగిన కరాటేలో పతకాలు సాధించిన విద్యార్థులు అభినందన కార్యక్రమం జరిగింది. రాజేష్ మాట్లాడుతూ పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో శ్రీ జోహార్ లాల్ నెహ్రూ మెమోరియల్ ఇంటర్ స్టేట్ ఇన్విటేషల్ కరాటే డూ ఛాంపియన్ షిప్ 2023 గాను రాష్ట్రస్థాయిలో ఈనెల 12న అకాడమీ ఆఫ్ షార్ట్ కాన్ కరాటే డు ఇండియా పోటీలు నిర్వహించారన్నారు. రాష్ట్రం నలుమూలల నుండి 600 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో స్థానిక హనుమాన్ జంక్షన్ శ్రీ చైతన్య పాఠశాల నుండి ఐదుగురు విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. గౌతమ్ వర్మ బంగారు పతకం, చైత్రిక, గుణవర్థన్ కాంస్య, తనుశ్రీ, హరినాథ్ రజిత పతకాలు, ప్రశంసాపత్రాలను సాధించారని వివరించారు. ఈ సందర్భంగా రీజినల్ ఇన్‌ఛార్జి ఎస్.పార్థసారథి, హైస్కూల్ డీన్ చిట్టిబాబు, ప్రైమరీ ఇన్చార్జ్ ఆమంత, సి బ్యాచ్ ఇంచార్జ్ మురళీకృష్ణ, ఏవో రమణ, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, కరాటే మాస్టర్ శ్రీనుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.










