Oct 30,2023 21:10

ఫొటో : విద్యార్థినికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న దృశ్యం

'శ్రీ చైతన్య' విద్యార్థుల ప్రభంజనం
ప్రజాశక్తి-కావలి : విక్రమ సింహపురి యూనివర్సిటీ ఇటీవల విడుదల చేసిన డిగ్రీ రెండవ, నాలుగవ సెమిస్టర్‌ ఫలితాలలో శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల విద్యార్థులు అన్ని కోర్సులలో యూనివర్సిటీ స్థాయిలో ఉత్తమ మార్కులను, పట్టణ స్థాయిలో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలను సాధించి టాపర్స్‌గా నిలిచారు. 4వ సెమిస్టర్‌ ఫలితాలలో బిఎస్‌సి (ఎంఎస్‌సిఎస్‌)లో జె.దీపక్‌ 9.80, షేక్‌.షరీనా 9.80, అమూల్య 9.78.పాయింట్లతో పట్టణ ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలను సాధించారు. బిఎస్‌సి (బిసిసిఎ) విభాగంలో ఎస్‌.మనుగ9.58, జి.మనోజ్ఞ 9.54.బిసిఎ విభాగంలో టి.జ్ఞానలహరి 8.66, పి.భాను 8.64.బీకాం విభాగంలో పి.ప్రమీల 9.19, యు.కవిత 9.16.బి.ఎ విభాగంలో ఎం.శోభారాణి 8.91, వై.బ్లెస్య్‌ 8.77 అత్యున్నతమైన పాయింట్లను సాధించారు. 2వ సెమిస్టర్‌ ఫలితాలలో బిఎస్‌సి (ఎంఎస్‌సిఎస్‌) విభాగంలో పి.పావని 9.85, అక్షయ 9.66, కావ్య 9.38 పాయింట్లతో పట్టణ ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలను సాధించారు.
బిఎస్‌సి (ఎంపిసిఎస్‌) విభాగంలో పి.సుష్మ 9.06, సి.హెచ్‌.అపర్ణ 8.85.బీకాం విభాగంలో ఎస్‌.ధనశ్రీ హిమజ 9.78'', పాయింట్లతో యూనివర్శిటీ స్థాయి ర్యాంక్‌, పట్టణ ప్రధమ స్థానం సాధించారు. షేక్‌.అయేషా 8.94., బిసిఎ విభాగంలో కె.స్నేహలత 9.39, డి.జయకీర్తన 9.22. బి.ఎ విభాగంలో సి.హెచ్‌.శ్రావణి 8.12, జి.విక్రమ్‌ 7.87 అత్యున్నతమైన పాయింట్లను సాధించారు. ఈ సందర్భంగా కళాశాలలో సోమవారం ఏర్పాటు చేసిన అభినందన సభలో కరస్పాండెంట్‌ డాక్టర్‌ బెజవాడ రవికుమార్‌ మాట్లాడుతూ తమ కళాశాలలో ఎప్పటికప్పుడు సాంకేతికపరమైన అంశాలను విశదీకరిస్తూ, నిరంతరం వాటిని పర్యవేక్షిస్తూ ఉత్తమ బోధన చేయడం వల్ల ఇంతటి ఘన విజయాలను సాధించినట్లు తెలిపారు. తమ కళాశాలలో విద్యార్థులకు అత్యుత్తమ విలువలతో కూడిన విద్యతో పాటుగా వివిధ సామాజిక అంశాలపై అవగాహన సదస్సులు నిర్వహించడం, అలాగే ''స్పోర్ట్‌ అండ్‌ గేమ్స్‌'', ''ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగాలలో'' విద్యార్థులను ప్రోత్సహించడం, ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నామన్నారు. అనంతరం అత్యుత్తమైన మార్కులు సాధించిన విద్యార్థులకు పుష్పగుచ్ఛాలను అందించి అభినందించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్స్‌ పి.జానకిరామ్‌, వి.కృష్ణంరాజు, ఎన్‌.మధు, ఎస్‌.వెంకయ్య, పి.వి.ఎస్‌.ప్రసాద్‌, ప్రిన్సిపాల్స్‌ పి.వి.రావు, రవికాంత్‌, అధ్యాపక, అద్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.