Aug 28,2023 20:03

వినతులు స్వీకరిస్తున్న కమిషనర్‌

ప్రజాశక్తి - ఆదోని
ప్రజలు సమస్యలను పరిష్కరించుకునేందుకు 'స్పందన'ను సద్వనియోగం చేసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ రఘునాథ్‌ రెడ్డి తెలిపారు. సోమవారం మున్సిపల్‌ కార్యాలయంలో నిర్వహించిన స్పందనలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కమిషనర్‌ మాట్లాడుతూ... ప్రజలు సమర్పించిన అర్జీల్లో ఆధార్‌ కార్డు నెంబర్‌ తప్పనిసరిగా పొందుపరచాలన్నారు. ఆర్థిక పరమైన ఫిర్యాదులు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఆస్తి పన్ను, రోడ్లు, డ్రెయినేజీకి సంబంధించిన అర్జీలు వచ్చాయన్నారు.