Apr 10,2023 23:04

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా) : స్పందనకు ముందస్తు సమాచారం లేకుండా గైర్హాజరు అయితే చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్‌ అపరాజిత సింగ్‌ స్పష్టం చేశారు.సోమవారం కలెక్టరేట్‌ లో నిర్వహించిన స్పందనలో జాయింట్‌ కలెక్టర్‌ పాల్గొని ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జె సి మాట్లాడుతూ జిల్లాలో వివిధ శాఖలకు సంబంధించి రీఓపెన్‌ అర్జీలు 25 వరకు వచ్చాయని శాఖల వారిగా సమీక్షిస్తూ వెంటనే పరిష్కరించాలని వీటిని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో సీనియర్‌ సిటిజెన్స్‌ , దివ్యాంగులు, అంగ వైకల్యంగల పాఠశాల విద్యార్థులకు ఏఏ పరికరాలు అవసరమో వాటిని మంజూరు చేయుటకు వెంటనే అవసరమైన ప్రతిపాదనలు పంపాలని వివిధ సంక్షేమశాఖల అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులలో అంగ వైకరులను గుర్తించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. వారికి ఏఏ పరికరాలు అవసరమై జాబితాలు పంపాలన్నారు. జిల్లాలో రీ సర్వే పనులు సరిహద్దు రాళ్ల ఏర్పాటుకు సంబంధించి సర్వే పూర్తయిన గ్రామాల్లో ఇప్పటిదాకా 48 వేల రాళ్లు ఏర్పాటు చేసినట్లు ఈ పనులు వేగవంతంగా నిర్వహించాలని సర్వే అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో డిఆర్వో ఎం. వెంకటేశ్వర్లు, కెఆర్జిఆర్సి డిప్యూటీ కలెక్టరు బి. శివనారాయణ రెడ్డి, ఆర్డివో ఐ.కిపోర్‌, ట్రైని డిప్యూటీ కలెక్టరు చైతన్య, జాయింట్‌ కలెక్టరుతో పాటు ప్రజల నుండి అర్జీలు స్వీకరించగా, సిపిఓ వై. శ్రీలత, డిఆర్డిఎ పివో పిఎస్‌ఆర్‌ ప్రసాద్‌, సర్వే, ఎడి గోపాల్‌ రాజ్‌, మూడ విసి రాజ్యలక్ష్మీ పాల్గొన్నారు.