Aug 28,2023 22:08

అర్జీదారులతో మాట్లాడుతున్న ఎస్‌పి విక్రాంత్‌

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : స్పందన కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యతనిచ్చి వెంటనే వారికి న్యాయం చేయాలని ఎస్‌పి విక్రాంత్‌ పాటిల్‌.. పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం స్పందన కార్యక్రమంలో ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. అర్జీదారులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. సంబంధిత పోలీసు అధికారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి సత్వర న్యాయం అందించేలా చూడాలని ఆదేశించారు. తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి పంపించాలని సూచించారు. కార్యక్రమంలో ఎఎస్‌పి (అడ్మిన్‌) ఒ.దిలీప్‌ కిరణ్‌, సిఐలు సిహెచ్‌.లక్ష్మణ రావు, ఎన్‌ .వి. ప్రభాకర్‌ రావు, ఎస్‌ఐ పాపారావు సిబ్బంది పాల్గొన్నారు.