పుట్టపర్తి రూరల్ : స్పందన కార్యక్రమంలో వారి వారి సమస్యలపై అందించిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు. చట్ట పరిధిలో ఉన్న ఫిర్యాదులు త్వరితగతిన పరిష్కరించాలని పోలీసు స్పందనకు లో వచ్చే ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహించ రాదని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఎస్పీ కార్యాలయానికి 36 ఫిర్యాదులు రాగా వాటిని ఎస్పీ పరిశీలించి ఫిర్యాదుదారులతో మాట్లాడి తగిన సూచనలు అందించారు. ఫిర్యాదులు అందిన వెంటనే సంబంధిత పోలీసు స్టేషన్లకు ఫోన్ చేసి పోలీసు చట్ట పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ, దిశ డీఎస్పీ వరప్రసాద్, లీగల్ అడ్వైజర్ సాయినాథ్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










