Apr 17,2023 22:09

సమస్యలు వింటున్న ఎస్పీ

ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్‌ : స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూలలనుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఎస్పీ ప్రతి పిటీషనర్‌ తో స్వయంగా మాట్లాడి వారి సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ కెవి. రామకృష్ణప్రసాద్‌, ఎస్‌బి డిఎస్‌పి ఉమా మహేశ్వర రెడ్డి, ఎస్‌బి సిఐ రవీందర్‌ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు