ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా) : స్పందన అర్జీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి. రాజబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్ స్పందన మీటింగ్ హాల్లో జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, డిఆర్‌ఓ ఎం. వెంకటేశ్వర్లు, కె ఆర్ ఆర్ సి డిప్యూటీ కలెక్టర్ బి శివ నారాయణ రెడ్డి ఆర్డీవో హారు కిషోర్ లతో కలిసి స్పందన కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. సంబంధిత శాఖల జిల్లా అధికారులను పిలిపించి వాటిని విధిగా సకాలంలో పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సాధ్యమైనంత వరకు సానుకూలంగా స్పందించి పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ ప్రతిష్టను పెంపొందించే విధంగా పరిష్కారం ఉండాలన్నారు. ఒకసారి పరిష్కరించిన అర్జీలు మళ్ళీ మళ్ళీ రాకుండా తగిన జాగ్రత్తలు వహించాలన్నారు. అర్జీల పరిష్కారంలో నాణ్యత ప్రమాణాలు విధిగా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ డిఏ ,డ్వామా పీడీలు పిఎస్‌ఆర్ ప్రసాద్, జి. సూర్యనారాయణ జెడ్పి సీఈవో జ్యోతిబసు, మున్సిపల్ కమిషనర్ చంద్రయ్య, డిపిఓ ఎస్వీ నాగేశ్వర్ నాయక్, డిఎంహెచ్ ఓ డా.గీతాబాయి, సిపిఓ వై. శ్రీలత, జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికార అధికారి సరస్వతి, బీసీ సొసైటీ ఈ డి శ్రీనివాస్, ముడా వీసీ రాజలక్ష్మి డిఎస్‌ఓ పార్వతి, ఏపీఎంఐపీ పిడి విజయలక్ష్మి ,తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.










