May 31,2023 22:38

సమావేశంలో మాట్లాడుతున పార్థసారధి

ప్రజాశక్తి -పెనుకొండ : చంద్రబాబుపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలను టీడీపీ జిల్లా అధ్యక్షులు బికె. పార్థసారథి తీవ్రంగా ఖండించారు. బుధవారం పట్టణంలోని టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు. తమ్మినేని చేసిన వ్యాఖ్యలు స్పీకర్‌ పదవికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉన్నాయన్నారు. ఉన్నతమైన పదవిలో ఉండి తనకు రాజకీయ బిక్ష పెట్టి, మంత్రి స్థానం కల్పించిన చంద్రబాబునాయుడు పై వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ నుండి నాయకుడిగా ఎదిగిన విషయం మరిచిపోకూడదని వ్యాఖ్యానించారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడు విజయవంతం అవడంతో పాటు మేనిఫెస్టో ప్రవేశపెట్టిన ఆరు పథకాలకు ప్రజలు జేజేలు పలుకడంతో వైసిపి నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. అందులో భాగంగానే చంద్రబాబు పై ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో సీనియర్‌ నాయకులు రామకృష్ణప్ప, రొద్దం కొట్టాల నారప్ప, మండల కన్వీనర్‌ సిద్దయ్య, పట్టణ కన్వీనర్‌ రవిశంకర్‌ , పుల్లగుర్ల శ్రీనివాసులు, కన్నా స్వామి, పాలడుగు చంద్ర, హుజూర్ల్లా ఖాన్‌, జావేద్‌, వాజిద్‌, రియాజ్‌, అనిల్‌ కుమార్‌, జిలాన్‌, కటికల కన్నా, ఇటికల బాబయ్య, గోని పేట సర్పంచి నాగరాజు, పోతిరెడ్డి, నాగప్ప, మాజీ సర్పంచి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.