
ప్రజాశక్తి-రామచంద్రపురం
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతి పేదవానికి సొంత ఇంటి కల నెరవేర్చాలి అనే లక్ష్యంతో రాష్ట్రంలోని పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు ఇల్లు నిర్మించారని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ఉండూరు గ్రామంలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉండూరు గ్రామంలో 383 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశామని, రూరల్ మండలానికి 251, అర్బన్ మండలానికి 132 మందికి, ఇళ్ల స్థలాలు మంజూరయ్యాయని మంత్రి తెలియజేశారు. అర్హత ప్రమాణికంగా ప్రతి పేదవానికినవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో అర్హత కలిగిన లబ్ధిదారునికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇళ్ల స్థలాల పట్టాలు పొందిన లబ్ధిదారులు వారి పట్టాపై ఉన్న సర్వే నెంబర్ను బట్టి వారి వారి స్థలాలను ముందుగా చూసుకుని త్వరగా ఇల్లు నిర్మాణం చేపట్టాలని లబ్ధిదారులకు సూచించారు. దేశంలో ఏ రాష్ట్రంలోని జరగని అభివద్ధి సంక్షేమ పథకాలు అమ్మ ఒడి, వైయస్సార్ పెన్షన్ కానుక, విద్యా దీవెన, వైఎస్‌ఆర్ ఆసరా, జగనన్న ఆరోగ్య సురక్ష, జగనన్న భూ సురక్ష, కాపు నేస్తం, జగనన్న తోడు, నేతన్న నేస్తం, రైతు భరోసా మన రాష్ట్రంలో సిఎం జగన్ సారథ్యంలో అమలుచేశారనిమంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ఎం.వెంకటేశ్వరరావు, ఎంపిపి అంబటి భవాని, వైస్ ప్రెసిడెంట్ పోతురాజు రజనీ కుమార్, ఎంపిటిసి సభ్యురాలు దుర్గ ఇతర అధికారులు గ్రామ సచివాలయ సిబ్బంది లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.