న్యూఢిల్లీ : సనాతన ధర్మంపై వ్యాఖ్యలకు గాను సుప్రీంకోర్టు శుక్రవారం తమిళనాడు ప్రభుత్వానికి, డిఎంకె నేత ఉదయనిధి స్టాలిన్‌కు నోటీసులిచ్చింది. సనాతన ధర్మం సమానత్వం, సామాజిక న్యాయ సూత్రాలకు విరుద్ధమని, దానిని నిర్మూలించాల్సి వుందని చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు నోటీసులిచ్చినట్లు సమాచారం. ఉదయనిధికి వ్యతిరేకంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటూ మద్రాస్‌కి చెందిన న్యాయవాది ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)ను దాఖలు చేసినట్లు తెలుస్తోంది.
ఇటీవల తమిళనాడులో రచయితల సంఘం నిర్వహించిన సమావేశంలో ఉదయనిధి స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సనాతన ధర్మం కరోనా, డెంగ్యూ,. మలేరియా వంటిదని పోల్చారు. ఇటువంటి నమ్మకాలని వ్యతిరేకించే బదులు వాటిని పూర్తిగా నిర్మూలించాలని అభిప్రాయపడ్డారు.










