Sep 07,2023 21:27

సమావేశంలో మాట్లాడుతున్న డిఆర్‌ఒ వెంకటరావు

ప్రజాశక్తి-పార్వతీ పురం : జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా సంతృప్తికర పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోవింద రావు అన్నారు. జగనన్నకు చెబుదాంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం జరిగింది. జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం అధికారులు కృషిచేయాలన్నారు. జిల్లా స్థాయిలో సివిల్‌ వివాదాల కోసం అందే సమస్యలను మండల స్థాయి కమిటీకి సిఫార్సు చేసి నిర్దేశిత సమయంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా, మండల స్థాయి సమన్వయ కమిటీలు క్రమం తప్పకుండా సమావేశమై తదనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకొంటాయని చెప్పారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ జె.వెంకటరావు, డిపిఒ బి.సత్యనారాయణ, జిల్లా రిజస్ట్రార్‌ ఎం.ఎస్‌.కె.పూర్ణచంద్‌, పార్వతీపురం టౌన్‌ సిఐ పివివిఎస్‌ఎన్‌ కృష్ణారావు, డిసిఆర్‌బి ఎస్‌ఐ డి.రవీంద్ర రాజు, మున్సిపల్‌ ఎఇ జె.ఆనంద్‌ పాల్గొన్నారు.