సంస్కృతం నేర్చుకోవాలనుకున్న వారి కోసం కేంద్రప్రభుత్వం ఓ కొత్తయాప్ను తీసుకొచ్చింది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చర్ రిలేషన్స్ (ఐసీసీఆర్) ద్వారా 'లిటిల్ గురు' పేరుతో యాప్ను అభివృద్ధి చేసింది. బెంగుళూరుకు చెందిన స్పోర్ట్స్ విజ్ అనే స్టార్టప్ సంస్థ సాయంతో ఈ యాప్ను రూపొందించింది. గూగుల్ ప్టేస్టోర్లో ఇది అందుబాటులో ఉంది. సంస్కృతం నేర్చుకోవాలనుకునేవారు ఈ యాప్ ద్వారా సులువుగా నేర్చుకోవచ్చని ఐసిసిఆర్ డిజి దినేష్ కె.పట్నాయక్ తెలిపారు. సంస్కృతం నేర్చుకునేందుకు అందుబాటులో ఉన్న మొదటియాప్ ఇదే.










