Aug 29,2023 20:05

చిత్రపటానికి పూలమాల వేస్తున్న ఉపాధ్యాయ సిబ్బంది

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌
సంస్కృతి, సాంప్రదాయాలకు వారధి మాతృ భాష అని సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్‌ తెలిపారు. మంగళవారం మండలంలోని పెద్దతుంబళం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో తెలుగు భాష దినోత్సవం నిర్వహించారు. తెలుగు భాషాభివృద్ధికి గిడుగు రామ్మూర్తి చేసిన సేవలను ప్రధానోపాధ్యాయులు వెంకటేశులు, తెలుగు ఉపాధ్యాయులు డాక్టర్‌ సక్కిం భాస్కర్‌, ఆవుల బసప్ప, రామలక్ష్మి, రామ సుబ్బయ్య కొనియాడారు. ఆదోనిలోని జిఎస్‌ఆర్‌, నేషనల్‌ స్కూళ్లలో తెలుగు భాష, జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను విద్యాసంస్థలు అధినేత గోపాల్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో జరిగిన క్రీడల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రధానోపాధ్యాయులు సత్యశ్రీ, విజరు కుమార్‌, వ్యాయామ ఉపాధ్యాయులు గోవిందు, రవి పాల్గొన్నారు. పెద్దకడబూరు మండలంలోని కంబదహాల్‌ ప్రాథమికొన్నత పాఠశాలలో తెలుగు భాష దినోత్సవం నిర్వహించారు. బాలబంధు, గణిత ఉపాధ్యాయులు గద్వాల సోమన్న, తెలుగు భాష ఉపాధ్యాయులు కేశవయ్య ఆధ్వర్యంలో విద్యార్థుల సమక్షంలో ఉపాధ్యాయులంతా గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మిగనూరు (రూరల్‌) మండలంలోని జవహర్‌ నవోదయ విద్యాలయంలో తెలుగు భాష దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవాలు నిర్వహించారు. బనవాసి నవోదయ విద్యాలయ ఇన్‌ఛార్జీ ప్రిన్సిపల్‌ కె.చందిరన్‌ సీనియర్‌ ఉపాధ్యాయులు ఎకె.బసవరాజ్‌, తెలుగు అధ్యాపకులు శశికిరణ్‌, నరేష్‌, జగన్నాథ్‌, కె.శిరీష, ఎం.వెంకటేష్‌, హరీష్‌ కుమార్‌, రింకుశర్మ, ఎం.శ్రీనివాసరావు, ఎ.శివాజీ రావు, అరవింద్‌ భట్‌, సత్యనారాయణ, సోనమ్‌ కుమారి, యోగేష్‌ చాంద్‌, రవీందర్‌, సునీత పాల్గొన్నారు.

జిఎస్‌ఆర్‌ స్కూల్‌లో విద్యార్థిని అభినందిస్తున్న హెచ్‌ఎం
జిఎస్‌ఆర్‌ స్కూల్‌లో విద్యార్థిని అభినందిస్తున్న హెచ్‌ఎం